ఐపీఎల్ లైవ్.. కిస్ చేసుకుంటూ కనిపించిన జంట.. ఇక సోషల్ మీడియాలో రచ్చ

IPL Cameraman Slammed For Showing ‘Kissing Couple’ On TV. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2022 ప్రస్తుతం కొనసాగుతూ ఉంది.

By Medi Samrat  Published on  4 April 2022 8:54 AM IST
ఐపీఎల్ లైవ్.. కిస్ చేసుకుంటూ కనిపించిన జంట.. ఇక సోషల్ మీడియాలో రచ్చ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2022 ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అభిమానులు ఇప్పటికే కొన్ని థ్రిల్లింగ్ మ్యాచ్ లను వీక్షించారు. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన పదో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీని ఓడించి గుజరాత్ టైటాన్స్ వరుసగా వారి రెండవ గేమ్‌ను గెలుచుకుంది. ఈ గేమ్ మాత్రమే కాదు.. అక్కడ కెమెరాలో రికార్డు అయిన ఘటన కారణంగా కూడా పలువురి దృష్టిని ఆకర్షించింది.

సాధారణంగా కెమెరామెన్స్ ప్రేక్షకులను కూడా చూపిస్తూ ఉంటారు. కొందరు మ్యాచ్ లలో కెమెరా కన్నుల్లో పడ్డం వలనే ఫేమస్ అయ్యారు కూడా..! ఈసారి మాత్రం స్టాండ్స్‌లో ఒక జంట ముద్దు పెట్టుకోవడం కనిపించింది. అందుకు సంబంధించిన విజువల్స్ త్వరగా వైరల్ అయ్యాయి. దీంతో కెమెరా ఆపరేటర్ల చర్యలు చర్చనీయాంశంగా మారారు.

మ్యాచ్ సమయంలో అనేక ఇతర ఆసక్తికరమైన సంఘటనలను కూడా కెమెరామెన్ క్యాప్చర్ చేస్తారు.. ఆన్-ఫీల్డ్ యాక్షన్‌తో ఆఫ్-ఫీల్డ్ ఘటనలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ జంట రొమాన్స్ కూడా వీడియోలో బంధించారు. అయితే కెమెరామెన్ ఈ క్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడం సరైనదేనా కాదా అనే దానిపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కామెంట్లను మీరు కూడా చదవచ్చు.

Next Story