ఆ స్టార్ ఆటగాడు వేలానికి దూరమయ్యాడు..!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం పాట నుండి వైదొలిగాడు.
By Medi Samrat Published on 6 Nov 2024 7:17 PM ISTఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం పాట నుండి వైదొలిగాడు. అయితే ఇంగ్లండ్ కు చెందిన రిటైర్డ్ ఆటగాడు, లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తన పేరును నమోదు చేసుకున్నాడు. కొత్త ఐపీఎల్ నిబంధనల ప్రకారం వచ్చే సీజన్ ముగిసిన తర్వాత జరిగే మినీ వేలం కోసం స్టోక్స్ తన పేరును నమోదు చేసుకోలేడు.
జేమ్స్ అండర్సన్ ఐపీఎల్ ప్లేయర్ గా వేలం కోసం నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్ మాజీ స్పీడ్‌స్టర్ 1.25 కోట్ల రూపాయల బేస్ ధరతో వేలంపాటలో అందుబాటులోకి రానున్నాడు. అండర్సన్ చివరిసారిగా 2014లో T20 మ్యాచ్ ఆడాడు. USA క్రికెటర్ సౌరభ్ నేత్రవల్కర్ 30 లక్షల ప్రాథమిక ధర లిస్టులో ఉన్నాడు. మునుపటి వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా INR 2 కోట్ల బేస్ ధరతో రంగంలోకి దిగాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా 2 కోట్ల బేస్ ధరతో రంగంలోకి దిగాడు.
1,574 మంది ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, వెంకటేష్ అయ్యర్, అవేష్ ఖాన్, దీపక్ చాహర్, దేవదత్ కిషన్ పడిక్కల్, ఇషాన్ పడిక్కల్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లు INR 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంపాటలో అందుబాటులోకి రానున్నారు.