IPL 2026 Auction : ఈ ఏడాది కూడా నిరాశే..!

2018లో తన కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన పృథ్వీ షా గత ఏడాది ఐపీఎల్ ఆడలేదు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని రిటైన్ చేసుకోలేదు.

By -  Medi Samrat
Published on : 16 Dec 2025 4:32 PM IST

IPL 2026 Auction : ఈ ఏడాది కూడా నిరాశే..!

2018లో తన కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన పృథ్వీ షా గత ఏడాది ఐపీఎల్ ఆడలేదు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని రిటైన్ చేసుకోలేదు. అలాగే మ‌రే ఇతర జట్టు అత‌డిని కొనుగోలు చేయలేదు. అయినప్పటికీ ఇటీవ‌లి ఫామ్ దృష్ట్యా IPL-2026 మినీ వేలంలో ఎవ‌రైనా అత‌డిని కోనుగోలు చేస్తార‌ని అంతా భావించారు.. కానీ పృథ్వీ ఈ సీజన్‌లో కూడా ఏ జట్టు అత‌డిని తీసుకోవ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు.

పృథ్వీ తన ఐపీఎల్ కెరీర్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు. ప్రారంభ సీజన్లలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న పృథ్వీ.. 2024 సంవత్సరం వరకు ఆ ఫ్రాంచైజీ తరపున ఆడాడు. అయితే.. పేలవమైన ఫామ్, వివాదాల‌ కారణంగా అతను గత సీజన్‌కు దూర‌మ‌య్యాడు. ఈసారి పృథ్వీ షా రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో దిగాడు. కానీ అతనిని ఏ టీమ్ కూడా తీసుకోలేదు.

2018లో ఢిల్లీ తరఫున పృథ్వీ మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 245 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 153.12, సగటు 27.22. 2019లో పృథ్వీ 16 మ్యాచ్‌ల్లో 353 పరుగులు చేశాడు. రెండు సీజన్లలో రెండేసీ అర్ధ సెంచరీలు సాధించాడు. 2020లో అతడి ప్రదర్శన బాగా లేదు. 13 మ్యాచ్‌ల్లోకేవ‌లం 228 పరుగులు మాత్రమే చేశాడు. కాక‌పోతే ఆ సీజ‌న్‌లోనూ రెండు అర్ధ సెంచరీలు చేశాడు. 2021లో మాత్రం 15 మ్యాచ్‌ల్లో 479 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. మరుసటి సంవత్సరం అతని ప్రదర్శన కాస్త ప‌ర్వాలేదు. 2022లో 10 మ్యాచ్‌లలో 283 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 152.97. రెండు అర్ధ సెంచరీలు చేసినప్పటికీ.. నిలకడగా లేడు. 2023లో పృథ్వీ కేవలం 8 మ్యాచ్‌లు ఆడగా 108 పరుగులు మాత్రమే చేశాడు. 2024లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో 198 పరుగులు మాత్రమే చేశాడు. రెండు సీజన్లలో ఒక్కో అర్ధ సెంచరీ సాధించాడు.

Next Story