ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ vs ఆర్సీబీ హైవోల్టేజ్ వార్
టాటా ఐపీఎల్ 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది.
By - Knakam Karthik |
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ vs ఆర్సీబీ హైవోల్టేజ్ వార్
టాటా ఐపీఎల్ 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు జరిగే ఈ మొదటి విడతలో మొత్తం 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున, మిగిలిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నారు.
టోర్నీలో భాగంగా మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడనుంది. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనుండగా, ఈ విడతలో నాలుగు డబుల్ హెడర్ (రోజుకు రెండు) మ్యాచ్‌లు ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ మ్యాచ్‌లను గౌహతిలో, పంజాబ్ కింగ్స్ న్యూ చండీగఢ్‌లో ప్రారంభించనున్నాయి. కాగా, బెంగళూరులో మ్యాచ్‌ల నిర్వహణ కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తుది అనుమతికి లోబడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం మార్చి 13న స్టేడియంలో భద్రతా పరమైన తనిఖీలు నిర్వహించనున్నారు.
🚨 News 🚨Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.More details ▶️… pic.twitter.com/8Iq492v8TE
— IndianPremierLeague (@IPL) March 11, 2026