ఐపీఎల్ లైవ్ చూడాలంటే?
అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ 18వ ఎడిషన్ కు వేళయింది.
By Medi Samrat
అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ 18వ ఎడిషన్ కు వేళయింది. మార్చి 22 నుండి మే 25, 2025 వరకు జరిగే ఈ సీజన్ లో ఈ సంవత్సరం ఛాంపియన్ గా నిలవడానికి 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీలో ఎన్నో సంచలనాలు, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు సాగనున్నాయి. 18వ ఎడిషన్ టోర్నమెంట్‌లో గ్రూప్ Aలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఉండగా.. గ్రూప్ Bలో ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఉన్నాయి.
జియోస్టార్ IPL 2025 కి అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి. అయితే అన్ని IPL మ్యాచ్‌లను JioHotstar అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వినియోగదారులు తొమ్మిది వేర్వేరు భాషలలో మ్యాచ్‌లను చూడవచ్చని కంపెనీ ధృవీకరించింది: ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, హర్యాన్వి, బెంగాలీ, భోజ్‌పురి, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ మ్యాచ్‌ల ఉచిత లైవ్ స్ట్రీమింగ్‌ను అందించడం లేదు. IPL 2025 లైవ్ స్ట్రీమ్‌ను చూడటానికి సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయాలి.
భారతదేశంలో టీవీ వినియోగదారులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అన్ని IPL 2025 మ్యాచ్‌లను చూడవచ్చు. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో జరుగుతుందని స్టార్ నెట్వర్క్ ఇప్పటికే ధృవీకరించింది.