IPL-2024: సన్‌రైజర్స్ కెప్టెన్ మళ్లీ మార్పు.. ఈసారి అతడేనా?
భారత్‌లో క్రికెట్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఐపీఎల్ సీజన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 10:13 AM GMTIPL-2024: సన్‌రైజర్స్ కెప్టెన్ మళ్లీ మార్పు.. ఈసారి అతడేనా?
భారత్‌లో క్రికెట్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఐపీఎల్ సీజన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఒక పండగలా ఐపీఎల్ సీజన్ కొనసాగుతుంది. అయితే.. ఐపీఎల్‌లో కొన్ని టీమ్‌లకు అస్సలు కలిసి రావడం లేదు. ఎడిషన్లు మారుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలరాత మారట్లేదు. 2016లో తొలిసారి టైటిల్ గెలవగా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. గత కొన్ని సీజన్లలో అయితే మరీ దారుణంగా విఫలం అవుతోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండిపోతుంది.
అయితే.. సన్‌రైజర్స్ జట్టును చాంపియన్స్‌గా నిలిపిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాక.. ఆ బాధ్యతలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ఇచ్చారు. అయినా ఫలితం మారలేదు. దాంతో.. కేన్ మామ నుంచి ఆ బాధ్యతలో మారోసారి మార్చారు. సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ మార్క్రమ్‌కు కెప్టెన్సీ ఇచ్చారు. ఇక మార్క్రమ్ కెప్టెన్సీలో కూడా సన్‌రైజర్స్ టీమ్ మరింత పేలవ ప్రదర్శన ఇచ్చింది. 14 మ్యాచ్‌లు ఆడి అందులో 4 మాత్రమే గెలిచింది. 2023లో పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది.
ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ టీమ్‌కు మంచి సారథి అవసరమని భావించిన యాజమాన్యం మినీ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను సొంతం చేసుకుంది. 2023 వరల్డ్ కప్‌లో విజేతగా నిలపడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అలాంటి ప్లేయర్‌ను భారీ అమౌంట్‌తో కొనుగోలు చేసింది. దాంతో.. ప్యాట్ కమిన్స్‌కు సన్‌రైజర్స్ టీమ్ కెప్టెన్సీ ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్ గావస్కర్ కూడా స్పందించారు.
సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్‌ను కొనుగోలు చేయడం మంచి విషయం అని చెప్పాడు సునీల్ గావస్కర్. ప్రస్తుతం సన్‌రైజర్స్ టీమ్‌కు మంచి కెప్టెన్ కావాలన్నారు. ప్యాట్ కమిన్స్ సమర్థంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాడని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే.. అతని కోసం టీమ్ మేనేజ్‌మెంట్ రూ.20.50 కోట్లు పెట్టడం కాస్త ఎక్కువే అన్నారు సునీల్ గావస్కర్.