IPL-2024: 277 పరుగులతో ఎస్‌ఆర్‌హెచ్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డులు
నిన్నటి ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబైతో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయడంతో పాటు అరుదైన రికార్డులు సాధించింది.
By అంజి Published on 28 March 2024 6:21 AM ISTIPL-2024: 277 పరుగులతో ఎస్‌ఆర్‌హెచ్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డులు
నిన్నటి ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబైతో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయడంతో పాటు అరుదైన రికార్డులు సాధించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యధిక స్కోరు. ట్రావిస్ హెడ్ (62), అభిషేక్ శర్మ (63), హెన్రిచ్ క్లాసెన్ (80 నాటౌట్).. ఈ ముగ్గురూ కలిసి ఉప్పల్ స్టేడియంలోకి పరుగుల సునామీనే తీసుకొచ్చారు. ఆపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024లో బుధవారం నాడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు విజయం సాధించేందుకు తీవ్ర ప్రయత్నం మాత్రం మానలేదు. తిలక్ వర్మ (64), టిమ్ డేవిడ్ (42 నాటౌట్), ఇషాన్ కిషన్ (34) శక్తి వంచన లేకుండా గెలిచేందుకు కృషి చేశారు. కానీ చివరికి 246/5తో ఓటమి వైపే నిలిచింది ముంబయి. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క మ్యాచ్‌లో 500కు పైగా పరుగులు నమోదయ్యాయి. అందులో 31 ఫోర్లు, 38 సిక్సర్లుండడం విశేషం.
రికార్డులు
148 - తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు. గత రికార్డు (2014లో పంజాబ్, 2021లో ముంబయి 131 పరుగులు) కనుమరుగైంది.
523 - ఈ మ్యాచ్‌లో నమోదైన పరుగులు. ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే.
277/3 - ముంబయిపై సన్‌రైజర్స్ స్కోరు. ఐపీఎల్ చరిత్రలోనే ఓ జట్టు అత్యధిక స్కోరు ఇదే. ఆర్సీబీ (2013లో పుణె వారియర్స్‌పై 263/5) రికార్డు బద్దలైంది.
16 - అర్ధశతకం సాధించేందుకు అభిషేక్ శర్మ ఆడిన బంతులు. సన్‌రైజర్స్ తరపున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్ అతనే.
1 - ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో ఒకే జట్టు నుంచి 20 బంతుల్లోపే అర్ధశతకాలు పూర్తి చేసుకున్న తొలి ద్వయంగా హెడ్- అభిషేక్ నిలిచారు.
38 - ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సంఖ్య. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు రికార్డు (ఆర్సీబీ- 33) బద్దలైంది.
66- ముంబయి పేసర్ మపాక సమర్పించుకున్న పరుగులు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నది అతనే.
200 - ముంబయి తరపున ఐపీఎల్‌లో రోహిత్ ఆడిన మ్యాచ్‌లు. ఆ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడింది అతనే.