ఐపీఎల్‌లో కొత్త రూల్.. బ్యాటర్లకు కష్టమే..!

ఐపీఎల్‌లో కొత్త రూల్‌ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  19 Dec 2023 8:45 AM GMT
ipl-2024, new rule, cricket, india ,

 ఐపీఎల్‌లో కొత్త రూల్.. బ్యాటర్లకు కష్టమే..!

ఇండియాలో క్రికెట్‌కు అభిమానులు ఎక్కువే ఉంటారు. స్వదేశంలో టీమిండియా మ్యాచ్‌లు ఉంటే చాలు ఎలా ఎగబతారో చూస్తుంటాం. ముఖ్యంలో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్‌ వేరు. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు ఆడుతున్నా..ఒక్కో టీమ్‌కు ఒక్కోలా ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. ఐపీఎల్‌ వేలం జరుగుతున్న క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. ఐపీఎల్‌లో కొత్త రూల్‌ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఆ కొత్త రూల్‌ను ఐపీఎల్-2024 సీజన్‌ నుంచే అమలు చేస్తారనే టాక్ నడుస్తోంది.

ఐపీఎల్-2024 సీజన్‌ నుంచి బ్యాటర్ల దూకుడుని కట్టడి చేసేలా ఒక ఓవర్లో రెండు బౌన్సర్లను అనుమతించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఐపీఎల్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రూల్‌ను ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ బీసీసీఐ అమలు చేసింది. దాంతో.. ఐపీఎల్‌లో కూడా కచ్చితంగా ఈ రూల్‌ను తీసుకొస్తారని చెబుతున్నారు. అయితే.. ఈ రూల్ వస్తే మాత్రం బౌలర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చిన్నమార్పే అయినప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలూ లేకపోలేదని టీమిండియా వెటరన్ జయదేవ్‌ ఉనద్కట్‌ తెలిపాడు.

ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించి మినీ వేలం దుబాయ్‌ వేదికగా జరుగుతోంది. ఈ కొత్త రూల్‌ను దృష్టిలో పెట్టుకునే వేలంలో ఆయా ఫ్రాంచైజీలు వ్యవహరించే చాన్స్ ఉంది. ఈ క్రమంలో వరల్డ్‌క్లాస్‌ పేసర్లపై కాసుల వర్షం కురిసే చాన్స్ ఉంది. పేసర్లు మిచిల్‌ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, దక్షిణాఫ్రికా సంచలనం గెరాల్డ్‌ కోట్జీని ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. కాగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వరల్డ్‌ కప్‌ సంచలన బ్యాటర్‌.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ట్రావిస్‌ హెడ్‌ను రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది.


Next Story