IPL-2024: ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు భారీ జరిమానా

సంజూశాంసన్‌కు షాక్‌ తగిలింది. భారీ జరిమానా విధించింది ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ.

By Srikanth Gundamalla  Published on  8 May 2024 12:55 PM IST
ipl-2024, fine,  rajasthan,  sanju samson,

IPL-2024: ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు భారీ జరిమానా

ఐపీఎల్ సీజన్‌ ప్లేఆఫ్‌ రేసు కొనసాగుతోంది. ఇది రసవత్తరంగా కొనసాగేలాగే కనబడుతోంది. అయితే.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో రాజస్థాన్‌ 20 పరుగుల తేడాతో ఓటమిని చూసింది. కానీ.. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం 86 పరుగులు చేసి అద్భుతంగా పోరాడాడు. ఈ మ్యాచ్‌ తర్వాత సంజూశాంసన్‌కు షాక్‌ తగిలింది. భారీ జరిమానా విధించింది ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ.

ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానాగా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్‌ కోడ్ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 2.8 లెవల్ 1 నేరానికి సంజూశాంసన్ పాల్పడ్డాడని కమిటీ తేల్చింది. మ్యాచ్‌ రిఫరీ నిర్ణయం మేరకు జరిమానా విధించినట్లు అడ్వైజరీ కమిటీ తెలిపింది.

ముకేశ్‌ కుమార్ వేసిన 16వ ఓవర్‌లో సంజూ షార్ట్‌ పిచ్ బంతిని లాంగాన్‌ వైపు సిక్స్‌ర్‌గా బాదేందుకు ప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్ వద్ద హోప్‌ క్యాచ్ అందుకున్నాడు. అయితే.. క్యాచ్ పట్టాక అతడి ఎడమపాదం బౌందరీ హద్దును దాదాపుగా తాకినట్లే రీప్లేలో కనిపించింది. షూకీ, బౌండరీ హద్దుకు మధ్య ఖాళీ కనిపించలేదు. కానీ రీప్లే పరిశీలించాక మూడో అంపైర్ కూడా దాన్ని ఔట్ అని ప్రకటించారు. బంతి బౌండరీ లైన్ తాకిందనడానికి స్పష్టమైన ఆధారం కనిపించలేదు. ఇక ఈ ఔట్‌తో శాంసన్‌ అసంతృప్తి చెందాడు. అంపైర్‌తో వాదన పెట్టుకున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే రాజస్థాన్‌ 162 పరుగులు ఉంది.. 26 బంతుల్లో 60 రన్స్ చేయాలి. ఇక చివరకు రాజస్థాన్ ఢిల్లీ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Next Story