IPL-2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీని చూశారా!

ఎంతో క్రేజ్‌ ఉన్న ఐపీఎల్‌ సీజన్‌-2024 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on  7 March 2024 2:15 PM GMT
ipl-2024, cricket, sunrisers hyderabad, new jersey,

IPL-2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీని చూశారా!

క్రికెట్‌లో ఎంతో క్రేజ్‌ ఉన్న ఐపీఎల్‌ సీజన్‌-2024 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్‌ కొనసాగినన్ని రోజులు క్రికెట్‌ అభిమానులకు పండగలా ఉంటుంది. రోజూ జరిగే మ్యాచ్‌ల కోసం ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. ఒక్కో టీమ్‌కు ఒక్కో ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. తమ టీమ్‌ కప్‌ కొట్టాలంటే.. తమ టీమ్‌ కప్‌ గెలవాలంటూ కోరుకుంటున్నారు. అయితే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా ఈ సీజన్‌లో గట్టి కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని భావిస్తోంది. టాప్‌ ప్లేయర్స్‌తో సీజన్‌లోకి అడుగుపెడుతోంది.

అయితే.. హైదరాబాద్‌ టీమ్‌ జెర్సీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి కొత్తగా కనిపిస్తోంది. కొత్త జెర్సీతో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. కొత్త జెర్సీ విషయాన్నే రివీల్‌ చేస్తూ భువనేశ్వర్‌ ఫొటోను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. సన్‌రైజర్స్‌ హీట్‌ను బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఐపీఎల్ 2024లో కోసం జ్వలించే కవచం అంటూ రాసుకొచ్చింది. సన్‌రైజర్స్‌ కొత్త జెర్సీని చూసిన అభిమానులు.. ఇది కొంచెం కొత్తగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చీతాలో ఉండే చారల్లా కనిపిస్తున్నాయని ఇంకొందరు అంటున్నారు. సన్‌రైజర్స్‌ ఈసారి గట్టి పోటీ ఇవ్వడం కాదు.. కప్‌ గెలవబోతుందంటూ సన్‌రైజర్స్‌ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు సన్‌రైజర్స్‌ టీమ్‌ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్‌ చేయిస్తోంది. మిగిలిన ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌కు చేరుకుంటున్నారు. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌ తొలి షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైంది. మార్చి 22వ తేదీ నుంచి మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌ మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో తలపడనుంది. మార్చి 27న రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో, మార్చి 31న మూడో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో, ఏప్రిల్‌ 5న నాలుగో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడబోతుంది హైదరాబాద్ టీమ్. వీటల్లో ముంబై, చెన్నైతో జరిగే మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి.

Next Story