IPL-2024: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించింది ఫ్రాంచైజీ.
By Srikanth Gundamalla Published on 4 March 2024 12:30 PM IST
IPL-2024: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఇండియా క్రికెట్‌కు అభిమానులు ఎక్కువే. ఏ ఆటకు లేని క్రీజ్ క్రికెట్‌కు ఉంటుంది. టీమిండియా మ్యాచ్‌లు జరిగితే చాలు అభిమానులు వచ్చేస్తారు. ఇక స్టేడియానికి వచ్చేందుకు వీలులేని వారు.. దూరంగా ఉన్నవారు టీవీలకు అతుక్కుపోతారు. అయితే.. ఐపీఎల్‌కు ఇంకాస్త ఎక్కువే ఆదరణ ఉంటుంది. ఐపీఎల్ సీజన్ ఉన్నన్ని రోజులు క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఒక్కో టీమ్‌కు ఒక్కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాగా.. ఐపీఎల్ -2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించింది ఫ్రాంచైజీ. అందరూ ముందుగా ఊహించినట్లుగానే కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను నియమించింది. ఐడెన్ మార్క్రాన్ స్థానంలో కమిన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఐపీఎల్-2024కి కమిన్స్ కొత్త కెప్టెన్ అంటూ వెల్లడించింది. తద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పదో కెప్టెన్‌గా నిలిచాడు పాట్ కమిన్స్. ఐపీఎల్ సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పాట్ కమిన్స్ కెప్టెన్సీపై కావ్య మారన్ విశ్వాసంగా ఉన్నారు. తాము కప్ గెలుస్తామని దీమాగా ఉన్నారు. పాట్ కమిన్స్ నేతృత్వంలోనే 2023 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే.
ఈసారి జరగనున్న ఐపీఎల్ సీజన్ కోసం గతేడాది జరిగిన వేలంలో పాట్ కమిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఏకంగా రూ.20.5 కోట్లు చెల్లించింది. కాగా.. కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో కమిన్స్ తనదైన ప్రాముఖ్యతను సపాదించుకున్నాడు. పాట్ కమిన్స్ 2023 సంవత్సరంలో మొత్తం 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 422 పరుగులు చేసి 59 వికెట్లు పడగొట్టాడు.
#OrangeArmy! Our new skipper Pat Cummins 🧡#IPL2024 pic.twitter.com/ODNY9pdlEf
— SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024