లైఫ్‌లో ఇవన్నీ సహజమే.. పాండ్యా కెప్టెన్సీపై స్పందించిన రోహిత్

ఐపీఎల్‌ సీజన్‌ 2024 మ్యాచ్‌లను వీక్షిస్తూ అభిమానులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ 2024 మ్యాచ్‌లను వీక్షిస్తూ అభిమానులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  3 May 2024 6:50 AM GMT
ipl-2024, cricket, rohit sharma,  hardik,

లైఫ్‌లో ఇవన్నీ సహజమే.. పాండ్యా కెప్టెన్సీపై స్పందించిన రోహిత్

ఐపీఎల్‌ సీజన్‌ 2024 మ్యాచ్‌లను వీక్షిస్తూ అభిమానులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో ముంబై పెద్దగా రాణించలేకపోతుంది. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఐదుసార్లు ముంబైని చాంపియన్స్‌గా నిలిపిన రోహిత్‌ను కాదనీ.. ఆ ఫ్రాంచైజీ గుజరాత్‌ టీమ్‌ నుంచి వెనక్కి తీసుకొచ్చి మరీ పాండ్యాకు కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది. దీనిపై రోహిత్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పైగా ముంబై వరుసగా ఓటములను చూడటంతో.. పాండ్యా కెప్టెన్సీని కూడా తప్పుబట్టారు. మ్యాచ్‌లు జరుగుతున్న పలు సందర్భాల్లో హార్దిక్‌ పాండ్యాను హేళన చేసిన విషయం తెలిసిందే.

అయితే.. తాజాగా హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో ఆడటంపై రోహిత్‌ శర్మ స్పందించాడు. ఈ మేరకు రోహిత్ మాట్లాడుతూ.. జీవితంలో ఈవన్నీ సహజమే అని చెప్పాడు. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా అన్నడు. ప్రతీది అనుభవంగానే చూడాలని పేర్కొన్నాడు. ఇక హార్దిక్‌ కెప్టెన్సీలో ఆడటంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదనీ రోహిత్ చెప్పాడు. తాను సారథి కానప్పుడు చాలా మంది నాయకత్వంలో మ్యాచ్‌లు ఆడినట్లు గుర్తు చేశాడు. ఇది తనకు కొత్తేమీ కాదని రోహిత్ తెలిపాడు. ఐపీఎల్ సీజన్‌ 17లో భారీ పరుగులు చేయడం పైన మాత్రమే కాదు.. ముంబై టీమ్‌కు మంచి ఆరంభాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నానని ఆ విధంగా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. ఓపెనర్‌గా వస్తున్నా కాబట్టి దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని రోహిత్ చెప్పాడు.

కాగా.. రోహిత్‌ శర్మ సీజన్ 17లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి 314 పరుగులు చేశాడు. కానీ.. ముంబై కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

Next Story