IPL-2024: రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఘనత
సంజూ శాంసన్ మెరుపు షాట్లతో తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్‌కు ఊపు తెచ్చాడు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 6:00 PM IST
IPL-2024: రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఘనత
ఐపీఎల్-2024 సీజన్ కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులు పండగ వాతావరణంలో మునిగి తేలుతున్నారు. ఐపీఎల్ సీజన్ జరిగినన్ని రోజులు సందడి వాతావరణమే ఉంటుంది. అయితే.. ఆదివారం రెండు మ్యాచ్‌లు ఉండగా.. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లు తలపడుతున్నాయి. రాజస్థాన్ హోంగ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే.. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. 4 వికెట్లను కోల్పోయిన రాయల్స్ 193 పరుగులు చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఘనతను సాధించాడు.
సంజూ శాంసన్ మెరుపు షాట్లతో తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్‌కు ఊపు తెచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే 82 పరుగులు చేశాడు. అయితే.. సంజూ ఐపీఎల్‌లో వరుసగా ఐదు సీజన్లలో తొలి మ్యాచ్‌లోనే 50 కంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేశాడు. అంటే వరుసగా ఐదు సీజన్లలో ఫస్ట్ మ్యాచ్‌లోనే దుమ్ము దులిపేశాడు. దాంతో.. సంజూ రికార్డును నెలకొల్పాడు.
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో సీఎస్కేపై 32 బంతుల్లో 74 పరుగులు చేశాడు సంజూ. ఇక ఆ తర్వాత 2021 సీజన్‌లో పంజాబ్‌పై 119 పరుగులు, 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55 పరుగులు చేశాడు. 2023 సీజన్‌లో ఓపెనర్ మ్యాచ్‌లో మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్‌పై 55 పరుగులు చేశాడు. ఇక తాజాగా జరిగిన 2024 ఐపీఎల్ సీజన్ తమ టీమ్ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో వరుస 50 ప్లస్ స్కోర్లు సాధించడం చాలా అరుదుగా జరిగింది.
SAMSON SHOW AT JAIPUR 🔥pic.twitter.com/Zj6devH0vU
— Johns. (@CricCrazyJohns) March 24, 2024