చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ ఘన విజయం

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

By Srikanth Gundamalla  Published on  6 April 2024 6:39 AM IST
ipl-2024, cricket, chennai, sunrisers hyderabad,

చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ ఘన విజయం 

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ ఈసారి మెరుగ్గా కనిపిస్తోంది. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్.. ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శనను కనబరుస్తోంది. శుక్రవారం ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్‌.. స్ట్రాంగెస్ట్‌ టీమ్‌గా ఉన్న చెన్నైపై 6 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. అంతేకాదు.. ఇదే సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లోనే రికార్డు స్కోరును నమోదు చేసిన విషయం తెలిసిందే.

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో చివర్లో తెలుగుతేజం నితీశ్‌రెడ్డి భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. కాగా..ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి పాట్ కమిన్స్‌ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన చె సూపర్‌కింగ్స్ 20 నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆతర్వాత ఏమంత కష్టం కాని టార్గెట్‌ను బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్‌ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. రెండు ఓడిపోయి.. మరో రెండింటిలో విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది.

హైదరాబాద్‌ జట్టులో ఓపెన్ అభిషేక్‌ శర్ (37), ట్రావిస్ హెడ్‌ (31) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఐడెన్ మార్‌క్రమ్ (50) పరుగులు చేశాడు. షాబాజ్ అహ్మద్ 18, హెన్రిచ్ కల్ఆసెన్ 10 (నాటౌట్), నితీశ్ రెడ్డి 14 (నాటౌట్) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2, దీపక్ చహర్ 1, మహీశ్ తీక్షణ 1 వికెట్ తీశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు ఛండీగఢ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలవనుంది.

Next Story