గుజరాత్‌పై విజయం.. ప్లేఆఫ్స్‌పై ఆర్సీబీకి ఆశలు సజీవం

చినస్వామి స్టేడియంలో శనివారం రాత్రి గుజరాత్‌ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌ జరిగింది.

By Srikanth Gundamalla  Published on  5 May 2024 2:24 AM GMT
ipl-2024, cricket, bangalore, won,  Gujarat,

గుజరాత్‌పై విజయం.. ప్లేఆఫ్స్‌పై ఆర్సీబీకి ఆశలు సజీవం 

బెంగళూరు చినస్వామి స్టేడియంలో శనివారం రాత్రి గుజరాత్‌ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టీమ్‌ ఘన విజయం సాధించింది. గుజరాత్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో ఐపీఎల్-2024 సీజన్‌లో ప్లేఆఫ్స్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది బెంగళూరు టీమ్.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌.. పరుగులు చేయడంలో చతికిల పడిపోయింది. ఆర్‌సీబీ బౌలర్లు రాణించడంతో కేవలం 147 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. బెంగళూరు స్టేడియం చిన్నది ఇది అందరికీ తెలిసిందే.. కానీ భారీ స్కోరు చేయడంలో గుజరాత్‌ విఫలమైంది. ఆర్సీబీ బౌలర్లు యశ్‌ దయాళ్, వైశాఖ్ విజయ్‌ కుమార్ , మహ్మద్ సిరాజ్‌ల ధాటికి కుప్పకూలింది గుజరాత్‌ బ్యాటింగ్ ఆర్డర్. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా స్కోర్‌ చేయాలని కాసేపు క్రీజులో ఉన్నా వారు కూడా అనుకున్నది చేయలేకపోయారు.

దయాళ్, వైశాఖ్, సిరాజ్ మంచి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో ఆర్సీబీని సునాయసంగా కట్టడి చేశారు. తలో రెండు వికెట్లు తీశారు. వారితో పాటు కెమరూన్ గ్రీన్, కర్ణ శర్మ కూడా చెరో వికెట్ తీశారు. 148 టార్గెట్‌తో బ్యాటింగ్‌ కు దిగిన ఆర్‌సీబీ.. డూప్లెసిస్, కోహ్లీ అద్భుత ఆరంభాన్ని అందించారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారు. మొదటి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం లభించింది. దాంతో. .ఆర్సీబీ విజయం అప్పుడే ఖాయం అయిపోయింది. కానీ. ఊహించని విధంగా జీటీ బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు. కొద్ది వ్యవధిలోనే ఆర్‌సీబీ ఆరు వికెట్లు కోల్పోయింది. చివరలో చివర్లో దినేశ్ (21), స్వప్నిల్ (15) టీంను ఆదుకోవడంతో 13. 4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ (2/29) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా.. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. జీటీ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

Next Story