ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఆదివారం (మే 28) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. చెన్నై ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు ఉవ్విళూరుతుండగా.. టైటిల్‌ను కాపాడుకునేందుకు గుజరాత్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లోనూ గెలిచి రెండోసారి విజేతగా నిలవాలని హార్దిక్ సేన తాపత్రయపడుతుంది.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు చెన్నై, గుజరాత్ మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్ల మధ్య ఇది ఐదో మ్యాచ్. నాలుగు మ్యాచ్‌ల్లో గుజరాత్ మూడు మ్యాచ్‌లు గెలిచింది. చెన్నై ఒకసారి గెలిచింది. గతేడాది హార్దిక్ పాండ్యా జట్టు.. చెన్నైని రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. ఈసారి ప్రారంభ మ్యాచ్‌లో హార్దిక్ సేన విజయం సాధించింది. క్వాలిఫయర్-1లో ఈ ఓటమికి ధోనీ సేన ప్రతీకారం తీర్చుకుంది. గుజరాత్‌ను ఓడించి చెన్నై ఫైనల్స్‌కు చేరుకుంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరిగా పోరు సాగనుంది. గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో ఉండటం కలిసివస్తోంది. ఈ సీజన్‌లో ఐదు అర్ధసెంచరీలు, మూడు సెంచరీలతో బీకర ఫామ్‌లో ఉన్నాడు. చెన్నై జట్టులోనూ డెవాన్ కావ్వాయ్, రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లో ఉన్నారు. ఇరువురు బ్మాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తూనే ఉన్నారు.