ఈ సీజన్ నుంచి ఐపీఎల్‌లో కొత్త నిబంధనలు..!
IPL 2022 set to see major changes.మండు వేసవిలో క్రికెట్ వినోదాన్ని పంచేందుకు మరో 11 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్
By తోట వంశీ కుమార్ Published on 15 March 2022 4:34 PM ISTమండు వేసవిలో క్రికెట్ వినోదాన్ని పంచేందుకు మరో 11 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుంది. మార్చి 26న ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చైన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు 70 మ్యాచులు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. కాగా.. ఫ్లే ఆఫ్ మ్యాచులు మినహా, లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్స్, వేదిలకను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ సారి టోర్నీలో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనలను కూడా ఐపీఎల్ లో ప్రవేశపెట్టనున్నట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.
* ఏదైనా జట్టులోని ఆటగాళ్లు కరోనా బారిన పడి మ్యాచ్ కు 12 మంది ఆటగాళ్లు అందుబాటులో లేనప్పుడు బీసీసీఐ ఆ మ్యాచును రీషెడ్యూల్ చేయవచ్చు. ఒక వేళ రీషెడ్యూల్ సాధ్యం కాకుంటే ఈ విషయాన్ని ఐపీఎల్ టెక్నికల్ కమిటీ దృష్టికి తీసుకువెలుతారు. వారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్.
* ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టు రెండు రివ్యూలు కోరే అవకాశం కల్పించారు. ఇంతక ముందు ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టు ఒక్కో సమీక్ష కోరే వెసులుబాటు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని రెండుకు పెంచారు. దీంతో ఒక్కో జట్టు ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండేసీ రివ్యూలు ఉపయోగించుకోవచ్చు.
* ఎవరైనా బ్యాటర్ క్యాచ్ ఔటైన సందర్భాల్లో క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్ చేయాలన్న కొత్త నిబంధనను ఇటీవల మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీజీ) తీసుకురాగా.. దీన్ని ఐపీఎల్‌లో అమలు చేయనున్నారు.
* ప్లేఆఫ్స్ లేదా ఫైనల్ లాంటి మ్యాచ్‌ల్లో ఫలితం తేలకుండా మ్యాచ్ టైగా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అలా కాని పక్షంలో లీగ్ స్టేజ్‌లోని పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉనన జట్టునే విజేతగా ప్రకటించనున్నారు.