ఆ మిస్టరీ గర్ల్ ఎవరు..?

IPL 2022 Mystery Girl. బ్రబౌర్న్ స్టేడియం గ్యాలరీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వీక్షిస్తున్న

By Medi Samrat  Published on  11 April 2022 6:00 PM IST
ఆ మిస్టరీ గర్ల్ ఎవరు..?

బ్రబౌర్న్ స్టేడియం గ్యాలరీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వీక్షిస్తున్న మిస్టరీ గర్ల్ పై కెమెరా మెన్ ఫోకస్ పెట్టారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తెల్లటి టాప్ ధరించి ఉన్న ఆ అమ్మాయి ఎవరో మొదట్లో తెలియనప్పటికీ, ఆమె వృత్తిరీత్యా నటి, నృత్యకారిణి అయిన ఆర్తీ బేడీ అని తర్వాత తెలిసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద T20 లీగ్ అవ్వడానికి ఒక పెద్ద కారణం. క్రికెట్ మరియు వినోదం. IPL రేటింగ్స్ భారీగా ఉండడానికి కారణం గ్లామర్ కూడా ఒక కారణమని అంటుంటారు. సంవత్సరాలుగా, కెమెరామెన్ మ్యాచ్ సమయంలో చూపించే వారు ఏకంగా సెలెబ్రిటీలే అయిన సంగతి తెలిసిందే. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడినప్పుడు కూడా అలాంటిదే జరిగింది.

రిషబ్ పంత్ క్యాచ్ తీసుకున్న సమయంలో కెమెరా లెన్స్ వైట్ టాప్ లో ఉన్న అమ్మాయిపై పడ్డాయి. ఆమె చిత్రాలు సోషల్ స్పేస్‌లో కనిపించాయి. మ్యాచ్ ముగియడానికి ముందే ఆమె వైరల్ అయ్యింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు, ఆమెకు 29.9K మంది ఫాలోవర్లు ఉన్నారు. గేమ్ ముగిసిన తర్వాత, ఆమె ఫాలోవర్లు 37.8Kకి పెరిగారు. ఇప్పుడు అంతకు మించి ఫాలోవర్స్ ఉన్నారు. #MysteryGirl, #AartiBedi హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్ పోస్ట్‌లను పరిశీలిస్తే కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.













Next Story