ఐపీఎల్‌-2022 మెగా వేలం : కొత్త నియమాలు, ఆట‌గాళ్ల‌ రిటెన్షన్స్‌, సాల‌రీ క్యాప్.. పూర్తి వివ‌రాలివిగో..

IPL 2022 mega auction Updates. ఐపీఎల్‌-2022 మెగా వేలం జనవరి 2022లో నిర్వహిస్తార‌ని క్రీడాలోక‌మంతా భావిస్తుంది

By Medi Samrat  Published on  19 Dec 2021 10:31 AM GMT
ఐపీఎల్‌-2022 మెగా వేలం : కొత్త నియమాలు, ఆట‌గాళ్ల‌ రిటెన్షన్స్‌, సాల‌రీ క్యాప్.. పూర్తి వివ‌రాలివిగో..

ఐపీఎల్‌-2022 మెగా వేలం జనవరి 2022లో నిర్వహిస్తార‌ని క్రీడాలోక‌మంతా భావిస్తుంది. ఈ నేఫ‌థ్యంలో కొత్త రిటెన్షన్ నియమాలు.. లక్నో, అహ్మదాబాద్ జట్ల చేరిక.. ప్రస్తుత ఎనిమిది కొత్త స్క్వాడ్‌లను చూడటానికి ఐపీఎల్‌ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

ఐపీఎల్‌-2022 ప్లేయర్ రిటెన్షన్ నియమాలు :

కొత్త రిటెన్షన్ నిబంధనల ప్రకారం.. ప్రతి జట్టు ఇప్పటికే ఉన్న తమ టీమ్‌లోని ప్లేయ‌ర్స్‌లో గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. IPL-2022 మెగా వేలం సమయంలో రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపిక అందుబాటులో ఉండదు. అలాగే.. మెగా వేలానికి ముందు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్‌లతో త‌లో ముగ్గురు ఆటగాళ్లు జ‌త‌క‌ట్టేందుకు బీసీసీఐ అనుమతించింది. రెండు కొత్త జట్లు ఒక విదేశీ ఆటగాడిని, ఇద్దరు భారతీయ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. వేలానికి ముందు బీసీసీఐ ప్రవేశపెట్టిన మరో కొత్త రూల్ ప్ర‌తి జ‌ట్టుకు రూ. 90 కోట్లు వేత‌న‌ పరిమితి కాగా.. ప్రతి జట్టు ఎంత మంది ఆటగాళ్లను త‌మ‌లో ఉంచుకోవాలనే దానిపై వేత‌న‌ పరిమితి ఆధారపడి ఉండ‌నుంది.

ఒక ఆటగాడు – రూ. 14 కోట్లు

ఇద్దరు ఆటగాళ్లు – రూ. 24 కోట్లు

ముగ్గురు ఆటగాళ్లు – రూ. 33 కోట్లు

నలుగురు ఆటగాళ్లు – రూ. 42 కోట్లు

ఫ్రాంచైజీలు ఇప్ప‌టికే త‌మ‌తో ఉంచుకున్న‌ ఆటగాళ్ల జాబితా :

చెన్నై సూపర్ కింగ్స్ - ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్

ముంబై ఇండియన్స్ - జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్‌, మహ్మద్ సిరాజ్.

కోల్‌కతా నైట్ రైడర్స్ - వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్.

ఢిల్లీ కాపిట‌ల్స్‌ - రిషబ్ పంత్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, అక్షర్ పటేల్.

పంజాబ్ కింగ్స్ - మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్.

రాజస్థాన్ రాయల్స్ - సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ - అబ్దుల్ సమద్, కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్Next Story
Share it