ఐపీఎల్-2022 మార్చి 26న ప్రారంభమై మే 29న ముగుస్తుందని బీసీసీఐ ప్రకటించింది. ముంబై, పూణే కేంద్రంగా నాలుగు వేదికల్లో 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. మార్చి 26 నుంచి టోర్నీ ప్రారంభం కానుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ గురువారం తెలిపారు. ఐపీఎల్‌లో ఈసారి 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని పేర్కొంది. ఇక ఈ సీజన్‌లో రెండు కొత్త జట్లు, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ చేరాయి. బీసీసీఐ లీగ్ దశ ఫార్మాట్‌ను కూడా వివరంగా వివరించింది. ప్లే-ఆఫ్ మ్యాచ్‌ల వేదికలపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
నిన్న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో టాటా ఐపీఎల్-2022 సీజన్‌కు సంబంధించి కింది కీలక నిర్ణయాలు తీసుకుంది. టోర్నమెంట్ మార్చి 26, 2022 నుండి ప్రారంభమవుతుంది. ఫైనల్ 29 మే, 2022న జరుగుతుంది. ముంబై, పూణేలోని నాలుగు అంతర్జాతీయ వేదికల్లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ఆడబడతాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదికలు తర్వాత నిర్ణయిస్తాం' అని బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.
ముంబైలోని వాంఖడే స్టేడియం, డివై పాటిల్ స్టేడియంలు ఒక్కొక్కటి 20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, పూణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం 15 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లలో 10 జట్లు 14 లీగ్ మ్యాచ్‌లు (7 హోమ్ మ్యాచ్‌లు, 7 అవే మ్యాచ్‌లు) ఆడతాయి. ఆ తర్వాత 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఐపీఎల్ టైటిల్ ఛాంపియన్‌షిప్‌ల సంఖ్య, ఆయా జట్లు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా జట్లను రెండు వర్చువల్ గ్రూపులుగా కేటాయించారు.
గ్రూప్ A : ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్
గ్రూప్ బి : చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్