ఎనిమిది జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే
IPL 2022 Full list of retained players.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌కు మరో రెండు కొత్త జట్లు రానున్న
By తోట వంశీ కుమార్ Published on 1 Dec 2021 8:51 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌కు మరో రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. దీంతో 2022 సీజన్‌ను 10 జట్లతో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల మెగా వేలానికి కసర్తత్తు మొదలైంది. వేలానికి ముందు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రక్రియ పూరైంది. ఒక్కొ ప్రాంచైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను అట్టి పెట్టుకునే అవకాశం ఉంది. ఈ గడువు నిన్నటి(నవంబర్ 30)తో పూర్తి అయ్యింది. 8 ప్రాంచైజీలు 32 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండగా.. కేవలం 27 మందిని మాత్రమే ప్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగ్గురు ఆటగాళ్లను, పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది.
అందరూ ఊహించినట్లే కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మను పాత ఫ్రాంచైజీలే అట్టిపెట్టుకోగా.. హైదరాబాద్‌తో వార్నర్, రషీద్ ఖాన్ బంధం ముగిసింది. ఈ ఇద్దరితో పాటు బెయిర్‌స్టోను ఆ జట్టు వదులుకొంది. ఇక పంజాబ్ జట్టు రాహుల్‌ను వదులుకోగా.. ఢిల్లీ క్యాపిటల్ జట్టు శ్రేయాస్ అయ్యర్‌ను విడిచిపెట్టింది.
ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను అట్టిపెట్టుకుందంటే..?
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ(రూ.16కోట్లు), బుమ్రా(రూ.12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ.8కోట్లు), పొలార్డ్(రూ.6 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ(రూ.15కోట్లు), మాక్స్‌వెల్(రూ.11కోట్లు), సిరాజ్(రూ.7 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్ : రవీంద్ర జడేజా(రూ.16కోట్లు), మహేంద్ర సింగ్ ధోని (రూ.12కోట్లు), మొయిన్ అలీ(రూ.8కోట్లు), రుతురాజ్(రూ.6కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ : పంత్ (రూ.16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ.9 కోట్లు), పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), నార్జ్ (రూ.6.5 కోట్లు)
కోల్‌కతా నైట్ రైడర్స్ : రసెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ.8 కోట్లు), నరైన్ (రూ.6 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : విలియమ్సన్ (రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (రూ.14 కోట్లు), బట్లర్ (రూ.10 కోట్లు), యశస్వి (రూ.4 కోట్లు)
పంజాబ్ కింగ్స్ : మయాంక్ (రూ.12 కోట్లు), అర్ష్‌దీప్ (రూ.4 కోట్లు)
వేలానికి ఏ ఫ్రాంచైజీ ఎంత నగదుతో వెలుతుందంటే..?
ముంబై ఇండియన్స్: రూ.48 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : రూ.47.5 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రూ.48 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ.57 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: రూ.48 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: రూ.62 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ.68 కోట్లు
పంజాబ్ కింగ్స్: రూ.72 కోట్లు