ప్రేక్షకులు లేకున్నా.. బీసీసీఐ భారీగానే ఆర్జించింది
IPL 2020 BCCI Revenues. మార్చిలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ను
By Medi Samrat Published on 24 Nov 2020 4:36 AM GMTమార్చిలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ను (బీసీసీఐ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) వాయిదా వేసింది. అసలు ఈ మెగా టోర్నీ జరుగుతుందా అన్న అనుమానాలు మొదలైన తరుణంలో యూఏఈ వేదికగా ఈ ఐపీఎల్‌ను సక్సెస్ పుల్‌గా నిర్వహించిన బీసీసీఐ.. భారీగానే ఆర్జించిందని కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు.
ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించడంపై తొలుత అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ప్రధాన కార్యదర్శి జైషా ధైర్యం చేసి ముందడుగు వేశారన్నారు. అయితే.. చెన్నై జట్టులో కరోనా కేసులు తేలడంతో కాస్త ఆలోచించామన్నారు. వారికి లక్షణాలు లేకపోవడంతో ఐసోలేషన్‌లో ఉంచామని.. తర్వాత ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనించామచామని చెప్పారు. వారు కోలుకోవడంతో.. టోర్నీ సక్సెస్ పుల్‌గా కొనసాగిందన్నారు. ఈ సీజన్ నిర్వహించడం ద్వారా బీసీసీఐ రూ.4వేల కోట్ల ఆదాయం పొందిందన్నారు. గతేడాదితో పోలీస్తే.. ఈ సారి టీవీ, డివిటల్ మాధ్యమాల ద్వారా వీక్షించిన వారి సంఖ్య 25 శాతం పెరిగిందన్నారు. నిర్వహాణ ఖర్చులను సైతం 35శాతం తగ్గించుకున్నట్లు తెలిపారు. యూఏఈ అతిథ్యం ఇవ్వడంతో.. వారికి రూ.100కోట్లు బీసీసీఐ చెల్లించింది.
ఎప్పుడూ అభిమానుల కేరింతలతో ఉత్సహాభరితంగా కనిపించే మైదానాలు ఈ సారి ఎవరూ లేక వెలవెలబోయాయి. అయినా ఆ లోటు కనిపించకుండా నిర్వాహాకులు వర్చువల్ పద్దతిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఐపీఎల్‌లో భాగంగా 18వందల మందికి 30వేలకు పైగా కరోనా టెస్ట్‌లు నిర్వహించినట్లు అరుణ్ తెలిపారు.