నేడు రాజస్థాన్ రాయల్స్‌తో త‌ల‌ప‌డ‌నున్న సన్‌రైజర్స్

IPL-15 First match between Sunrisers Hyderabad and Rajasthan Royals. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు మంగళవారం సంజూ శాంసన్ సార‌ధ్యంలోని

By Medi Samrat  Published on  29 March 2022 2:24 PM IST
నేడు రాజస్థాన్ రాయల్స్‌తో త‌ల‌ప‌డ‌నున్న సన్‌రైజర్స్

కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు మంగళవారం సంజూ శాంసన్ సార‌ధ్యంలోని రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఐపీఎల్-15వ సీజన్‌లో ఇరు జట్లకు మొద‌టి గేమ్‌. ఇక పుణే పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్ది పిచ్ నెమ్మదిగా మారుతూ.. బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. టాస్ గెలిచిన వారు బౌలింగ్ వైపే మొగ్గు చూపుతార‌ని అంటున్నారు. పూణేలో ఉష్ణోగ్రత కూడా సాధార‌ణ స్థాయిలో ఉంది. మ్యాచ్ జ‌రుగుతున్న‌ సమయంలో ఎటువంటి గాలులు కాని.. వర్షం కురిసే అవకాశాలు లేవు. చివ‌ర‌గా ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా సన్‌రైజర్స్ విజ‌యం సాధించింది. మ‌రి ఈ పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌నే విష‌యం మ‌రికొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

పూర్తి స్క్వాడ్ :

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, జేమ్స్ నీషమ్, అనునయ్ సింగ్, డారిల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్ (వికెట్-కీపర్) కీపర్), ధ్రువ్ జ్రూయెల్ (వికెట్-కీపర్), శుభమ్ గర్వాల్, కుల్దీప్ యాదవ్, నాథన్ కౌల్టర్-నైల్, నవదీప్ సైనీ, ఒబెద్ మెక్‌కాయ్, కుల్దీప్ సేన్, తేజస్ బరోకా, కెసి కరియప్ప, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ.

సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, శశాంక్ సింగ్, రవికుమార్ సమర్థ్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, సీన్ అబాట్, అభిషేక్ శర్మ, శ్రేయాస్ గోపాల్, గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్ (వికెట్-కీపర్), ఉమ్రాన్ మాలిక్ (వికెట్-కీపర్), సౌరభ్ దూబే, రొమారియో షెపర్డ్, ఫజల్హాక్ ఫరూకీ, జగదీషా సుచిత్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్.

ప్రాబబుల్ ప్లేయింగ్ XI:

SRH: ఐడెన్ మార్క్రామ్, అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (c), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (wk), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, T నటరాజన్.

RR: జోస్ బట్లర్ (wk), దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జేమ్స్ నీషమ్/నాథన్ కౌల్టర్-నైల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ.



























Next Story