పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (51)కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన లాహోర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు యాంజియోప్లాస్టి శ్రస్తచికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం ఈ మాజీ కెప్టెన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. గత మూడు రోజుల నుంచి ఆయన ఛాతిలో నొప్పితో బాధపడుతున్నారని.. సోమవారం భరించలేని నొప్పితో విలవిలలాడంతో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల్లో గుండెపోటుగా నిర్థారించిన వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారన్నారు.
పాక్‌స్థాన్ తరుపున ఇంజమామ్ 1991 నుంచి 2007 వరకు ఆడాడు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 1992లో ప్రపంచకప్‌సాధించిన పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. విజయవంతమైన సారధిగా గుర్తింపు పొందాడు. తన కెరీర్‌లో 375 వన్డేలు ఆడిన ఇంజీ 11739 పరుగులు చేశాడు. పాకిస్థాన్ తరుపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 119 టెస్టుల్లో 8830 పరుగులు చేశాడు. 2016 నుంచి 2019 వరకు పాక్ ఛీప్ సెలెక్టర్‌గానూ సేవలందించాడు.