ప్రముఖ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ( NADA) సస్పెన్షన్ వేటు వేసింది. నాగపురి రమేష్ వద్ద కోచింగ్ తీసుకున్న పలువురు క్రీడాకారులు డోప్ టెస్టుకు నిరాకరించారు. డోప్ టెస్టుకు పరాస్ సింఘాల్, పూజా రాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాస్, చెలిమి ప్రతుష, శుభం మహరా, కిరణ్ మరియు జ్యోతి అనే ఏడుగురు అథ్లెట్లు శాంపుల్స్ ఇవ్వడానికి నిరాకరించినట్టు అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారికి కోచింగ్ ఇచ్చిన రమేష్ తో పాటు అసిస్టెంట్ కోచ్ లు అయిన కరంవీర్ సింగ్, రాకేశ్ లపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. అదే విధంగా ఈ ముగ్గురికి భారీగా జరిమానా విధిస్తూ నాడా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో వారికీ కోచ్ గా ఉన్న నాగపురి రమేష్ పై వేటు పడింది.గతం లో నాగపురి రమేష్ ద్రోణాచారి అవార్డు పొందారు.నాగపూరి రమేష్ అంతర్జా తీయ ప్లేయర్స్ దుతి చంద్, పారా ఒలంపియాన్ జీవంజి దీప్తి, నందిని వంటి దిగ్గజ క్రీడాకారులను తీర్చి దిద్దారు.నాగపురి తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్ ల పైనా కూడా నసస్పెన్షన్ వేటు పడింది. దీనిపై రమేష్ స్పందిస్తూ.. తాను జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టం చేశారు. పేద క్రీడాకారులను అంతర్జాతీయస్థాయిలో తీర్చి దిద్దటమే తన లక్ష్యం అన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని కోచ్ రమేష్ పేర్కొన్నారు.