లంక ప‌ర్య‌ట‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. కెప్టెన్ ఎవ‌రంటే..?

India’s Squad For Sri Lanka Announced.కోహ్లీ నేతృత్వంలోని భార‌త రెగ్యుల‌ర్ జ‌ట్టు న్యూజిలాండ్‌తో ప్ర‌పంచ టెస్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2021 2:46 AM GMT
లంక ప‌ర్య‌ట‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. కెప్టెన్ ఎవ‌రంటే..?

కోహ్లీ నేతృత్వంలోని భార‌త రెగ్యుల‌ర్ జ‌ట్టు న్యూజిలాండ్‌తో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇప్ప‌టికే ఇంగ్లాండ్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో జూలైలో శ్రీలంక‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్ కోసం మ‌రో భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) జ‌ట్టును ఎంపిక చేసింది. సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ శిఖ‌ర్ ధావ‌న్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయ‌గా.. పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. నెట్ బౌలర్లుగా ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్‌దీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జీత్ సింగ్ ఎంపిక చేశారు.

భారత వన్డే, టీ20 జట్టు:

శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హర్దిక్‌ పాండ్య, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యుజువేంద్ర చాహల్‌, కే గౌతమ్‌, కృనాల్‌ పాండ్య, కుల్దీప్‌ యాదవ్‌, వీ చక్రవర్తి, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా

ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడ‌నుంది. జులై 13న భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే జరుగనుండగా.. జూన్‌ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే‌ జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ నిమిత్తం భారత చీఫ్ కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించబోతున్నాడు. మ్యాచ్‌లన్నీ కొలంబో వేదికగా జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.


Next Story
Share it