World Cup : ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్‌

ICC ప్రపంచ కప్ 2023లో భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియాతో తన మొదటి మ్యాచ్ ఆడనుంది.

By Medi Samrat  Published on  7 Oct 2023 11:00 AM GMT
World Cup : ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్‌

ICC ప్రపంచ కప్ 2023లో భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియాతో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని ఎం చిదంబరం క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నీని విజయంతో ప్రారంభించాలని రోహిత్ సేన‌ ఉవ్విళ్లూరుతోంది. కంగారూ జట్టు కూడా ప్రపంచ కప్‌ను అట్టహాసంగా ప్రారంభించాలనుకుంటోంది.

ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ లేకుండానే భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. ఈ కారణంగా గిల్‌ మొదటి మ్యాచ్ ఆడటం లేదు. గిల్ స్థానంలో రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. విరాట్ కోహ్లి మూడో స్థానంలో.. మిడిల్ ఆర్డర్ బాధ్యత శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా భుజాలపై ఉంటుంది.

చెన్నైలోని ఎం చిదంబరం క్రికెట్ స్టేడియం పిచ్‌ను చూస్తుంటే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు స్పిన్నర్లతో భారత జట్టు ఆస్ట్రేలియాపై ఫీల్డింగ్ ఎంచుకోనుంది. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్‌తో అసీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్ప‌లు పెట్ట‌నున్నారు. పేస్ అటాక్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ విధ్వంసం సృష్టించనున్నారు.

టీమ్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Next Story