భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కాంస్యం కోసం జరిగిన మ్యాచ్ లో ఎలాంటి అద్భుతం చేయలేకపోయాడు. కాంస్య పతక మ్యాచ్‌లో 21-13, 16-21, 11-21 తో మలేషియాకు చెందిన లీ జి జియా చేతిలో ఓడిపోయాడు లక్ష్యసేన్. భారత్ బ్యాడ్మింటన్ విభాగంలో ఒక్క పతకం కూడా లేకుండా భారత షట్లర్లు ఇంటికి తిరిగి వచ్చారు.
లక్ష్య సేన్ కాంస్య పతక మ్యాచ్‌లో మొదటి గేమ్‌ను ఎంతో సులభంగా గెలుచుకున్నాడు. అతను కేవలం 20 నిమిషాల్లో 21-13తో లీ జియాను ఓడించాడు. 7వ సీడ్ లీ జి జియా కనీసం పోటీ ఇవ్వలేకపోయాడు మొదటి గేమ్ లో..! అయితే ఆ తర్వాత రెండు గేమ్ లలో లీ జి జియా రెచ్చిపోయి ఆడాడు. 21-16, 21-11తో గెలుచుకున్నాడు. మెన్స్ సింగిల్స్ లో లక్ష్య సేన్ నాలుగో స్థానంలో నిలిచాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో అత్యంత బలమైన బ్యాడ్మింటన్ బృందం బరిలోకి దిగింది.. అయితే ఒక్కరూ పతకం సాధించలేకపోయారు. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్, పివి సింధు సెమీ-ఫైనల్ లకు ముందే టోర్నమెంట్ నుండి వైదొలిగారు. లక్ష్య సేన్ కాంస్య పతకానికి జరిగిన మ్యాచ్ లో ఒక గంట, 10 నిమిషాల సుదీర్ఘ మ్యాచ్ లో ఓడిపోయాడు.