రోహిత్‌కు బ‌ర్త్ డే విషెష్ వెల్లువ‌..

Indian Skipper Rohit Sharma Turns 35, Wishes Pour In On Social Media. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శ‌నివారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

By Medi Samrat  Published on  30 April 2022 11:13 AM GMT
రోహిత్‌కు బ‌ర్త్ డే విషెష్ వెల్లువ‌..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శ‌నివారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రోహిత్‌ తన 15 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో అనేక రికార్డులను సృష్టించాడు. క్రికెట్‌లో ఏ ఆట‌గాడు బద్దలు కొట్టలేని మైలురాళ్లను సాధించాడు. వ‌న్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్. 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో జన్మించాడు రోహిత్. 2013లో ఎంఎస్ ధోని అతన్ని ఓపెనర్‌గా చేసిన వెంటనే, బ్యాట్స్‌మెన్‌గా అతని ప్రదర్శన మెరుగ‌య్యింది. ప్రస్తుతం జట్టులోని మూడు ఫార్మాట్‌లకు రోహిత్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

క్రికెటర్లు, ప్ర‌ముఖులు రోహిత్‌ పుట్టినరోజు సంద‌ర్భంగా విషెష్ తెలుపుతున్నారు.

మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు రోహిత్‌.. ఇలానే ఎదుగుతూ ఉండ‌ని కూ చేశాడు.

స్పోర్ట్స్ కంటెంట్ ప్రొఫెషనల్ గౌరవ్ కల్రా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రోహిత్ శర్మకు నేటితో 35 ఏళ్లు. అతను గత దశాబ్దంలో భారీ పరుగులను సాధించాడు. భారత జ‌ట్టు అన్ని ఫార్మాట్‌ల కెప్టెన్‌గా.. వ‌చ్చే సంవ‌త్స‌రం అంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు కూ చేశాడు.

మరో క్రికెటర్ అవినాష్.. హ్యాపీ బర్త్‌డే హిట్‌మ్యాన్.. మీ ప్రతిభతో మమ్మల్ని అలరిస్తూ ఉండండని కూ చేశాడు.

అలాగే భారత మహిళా క్రికెటర్లు, క్రీడాభినులు ఎంతో మందికి రోహిత్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.Next Story
Share it