చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల స్క్వాష్ టీమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్ మెన్స్ టీమ్ ఫైనల్‍లో భారత జట్టు 2-1 తేడాతో పాకిస్థాన్‍ను ఓడించి గోల్డ్ మెడల్‍ను దక్కించుకుంది. ఈ ఏషియన్ గేమ్స్‌లో భారత్‍కు ఇది పదో స్వర్ణ పతకం. ఉత్కంఠగా జరిగిన స్క్వాష్ ఫైనల్‍లో సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేశ్ మన్‍గోన్కర్‌తో కూడిన భారత జట్టు గోల్డ్ గెలిచింది.
ఫైనల్ మ్యాచ్ తొలి గేమ్‍లో 8-11, 3-11, 2-11 తేడాతో పాక్ ప్లేయర్ నాజిర్ ఇక్బాల్ చేతిలో మహేశ్ పరాజయం చెందడంతో 0-1తో భారత్ వెనుకబడింది. మహ్మద్ అసీమ్ ఖాన్‍ను 11-5, 11-1, 11-3 తేడాతో భారత ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఓడించాడు. అనంతరం నిర్ణయాత్మక గేమ్‍లో అభయ్ సింగ్ 11-7, 9-11, 8-11, 11-9, 12-10తో నూర్ జమాన్‍ను 3-2 తేడాతో అభయ్ ఓడించాడు. ఫైనల్‍లో 2-1 తేడాతో భారత్ గెలుపు అందుకుంది. స్క్వాష్ పురుషుల టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లో కూడా భరత్ కు స్వర్ణం దక్కడం విశేషం. రోహన్ బోపన్న- రుతుజా భోసాలే జోడీ ఫైనల్లో విజయకేతనం ఎగురవేసింది. చైనీస్ తైపీకి చెందిన ఎన్ షువో లియాంగ్, త్సుంగ్ హావో హువాంగ్ జోడీపై 2-6, 6-3, 10-4తో బోపన్న, రుతుజా జోడీ విజయం సాధించింది.