మ్యాచ్ మ‌ధ్య‌లో ఆసీస్ ఫ్యాన్‌కు ప్ర‌పొజ్ చేసిన భార‌త అభిమాని.. త‌రువాత ఏమైందంటే..?

Indian fan proposes Australian girl. ఇండియా-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఆదివారం సిడ్ని వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో ఓ

By Medi Samrat  Published on  30 Nov 2020 6:31 AM GMT
మ్యాచ్ మ‌ధ్య‌లో ఆసీస్ ఫ్యాన్‌కు ప్ర‌పొజ్ చేసిన భార‌త అభిమాని.. త‌రువాత ఏమైందంటే..?

ఇండియా-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఆదివారం సిడ్ని వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. టీమ్ఇండియా చేజింగ్ చేస్తుండ‌గా.. 20 ఓవ‌ర్ త‌రువాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ ఇండియన్ ఫ్యాన్ చేసిన సందడి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ్యాచ్ చూస్తున్న ఆస్ట్రేలియా లేడి ఫ్యాన్స్‌కు భార‌త అభిమాని ప్ర‌పొజ్ చేశాడు. మోకాళ్లపై కూర్చొని తనవెంట తీసుకొచ్చిన రింగ్‌ను తన ప్రేయసి వేలికి తొడిగాడు.



అంత మంది మ‌ధ్య‌లో త‌న‌కు ప్ర‌పొజ్ చేయ‌డంతో.. స‌ద‌రు యువ‌తి తొలుత ఆశ్చ‌ర్య పోయింది. తేరుకుని అత‌డి ప్రేమ‌ను అంగీక‌రించింది. దీంతో వారిద్ద‌రూ హ‌గ్ చేసుకుని స్టేడియం సాక్షిగా ముద్దు పెట్టుకున్నారు. ఆసక్తికరంగా నిలిచిన ఈ సీన్ టీవీ కెమెరాలు పసిగట్టాయి. మ్యాచ్ జరుగుతున్నంత సేపు పదే పేదే చూపించాయి. ఇక వీరి ప్రపోజ్‌ను మైదానంలోని బిగ్ స్క్రీన్‌పై చూసిన ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ చప్పట్లతో ఈ ప్రేమ పక్షులను అభినందించాడు. దీనికి సంబంధించిన వీడియో.. క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అయింది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు‌) మెరుపు సెంచ‌రీతో రాణించగా.. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు‌), ఆరోన్ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివరలో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు‌) ‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు‌) విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన భారత్ మళ్లీ తడబడింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 338 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్‌(30), మ‌యాంక్ అగ‌ర్వాల్(28) శుభారంభాన్ని అందించ‌లేక‌పోయారు. ఆ త‌రువాత వ‌చ్చిన కోహ్‌లీ (89) రాణించ‌గా.. శ్రేయాస్ (36), రాహుల్‌(76)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. అయితే.. చివ‌ర్లో బ్యాట్స్‌మెన్లు క్యూ క‌ట్ట‌డంతో భార‌త్ 338 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది.




Next Story