పాక్ బ్లాక్ మెయిలింగ్ ను ఐసీసీ సహించకూడదు

2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

By -  అంజి
Published on : 2 Feb 2026 9:43 AM IST

India, cricket legend Sunil Gavaskar, ICC , Pakistan blackmailing, T20 World Cup

పాక్ బ్లాక్ మెయిలింగ్ ను ఐసీసీ సహించకూడదు

2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 'బ్లాక్ మెయిలింగ్' రాజకీయాలను ఐసీసీ ఏమాత్రం సహించకూడదని, టోర్నీకి కొన్ని రోజుల ముందు లేదా టోర్నీ మధ్యలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పాక్ వైఖరిని ఐసీసీ తీవ్రంగా పరిగణించాలని, భవిష్యత్తులో ఏ దేశం కూడా ఇలాంటి సాహసం చేయకుండా ఉండేలా పాకిస్థాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలని గవాస్కర్ అన్నారు.

కేవలం పాయింట్లు కోత విధించడమే కాకుండా, ఆర్థికపరమైన జరిమానాలు కూడా వేయాలని సూచించారు. ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని నిలిపివేయడంతో పాటు, భవిష్యత్తులో పాకిస్థాన్ నిర్వహించాల్సిన ఐసీసీ టోర్నీల హోస్టింగ్ హక్కులను కూడా వెనక్కి తీసుకోవాలని గవాస్కర్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడే విదేశీ ఆటగాళ్లకు ఎన్‌వోసీలు ఇవ్వకుండా అడ్డుకోవడం ద్వారా ఆ దేశ క్రికెట్‌ను గట్టిగా దెబ్బకొట్టాలని సూచించారు. పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలోనే ఉంది. ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Next Story