భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. క్వీన్స్ ల్యాండ్ వేదికగా జరిగిన ఈ నాలుగో టీ20 మ్యాచ్ లో ఏకంగా 48 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ లో నిలిచింది.
మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 167 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. పెనర్ శుభ్‌మన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (28), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 20), అక్షర్ పటేల్ (21), శివమ్ దూబే (22) పరుగులతో రాణించారు. ఇక ఛేజింగ్ లో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది. 48 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ 2, దూబే 2 వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అక్షర్ పటేల్ నిలిచాడు. ఆఖరి టీ20 నవంబర్ 8న జరగనుంది.