ఒక్క టాస్ గెలవలేదు, ఒక్క మ్యాచ్ ఓడకుండా..ఛాంపియన్స్ ట్రోఫీ కప్ కొట్టిన టీమిండియా

న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా జయకేతనం ఎగురవేసింది.

By Knakam Karthik  Published on  9 March 2025 10:12 PM IST
Sports News, India Won Champions Trophy, Team India, Icc, Bcci

ఒక్క టాస్ గెలవలేదు, ఒక్క మ్యాచ్ ఓడకుండా..ఛాంపియన్స్ ట్రోఫీ కప్ కొట్టిన టీమిండియా

భారత్ మరో ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా జయకేతనం ఎగురవేసింది. 252 పరుగుల టార్గెట్‌లో బరిలోకి దిగిన టీమిండియా న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను టీమిండియా సిక్స్ బాల్స్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులను 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో ఇన్నింగ్స్ అదరగొట్టాడు. అయితే విరాట్ మాత్రం ఒక్క పరుగు వద్దే అవుట్ అయ్యి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. కాగా శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 48 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 34 పరుగులు, శుభ్‌మన్ గిల్ 31, అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్యా 18, రవీంద్ర జడేజా 9 పరుగులు చేశారు. దీంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత జట్టు 9 నెలల్లో రెండవ ట్రోఫీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన తర్వాత, రోహిత్ కెప్టెన్సీలో టీం ఇండియా 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మార్చి 9వ తేదీ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, అద్భుతమైన బౌలింగ్, కెప్టెన్ రోహిత్ శర్మ బలమైన ఇన్నింగ్స్ సహాయంతో టీమ్ ఇండియా న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో, 25 ఏళ్ల క్రితం ఇదే టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. దీనితో పాటు, అతను ఈ ట్రోఫీని గరిష్టంగా గెలుచుకున్న రికార్డును కూడా భారత్ సృష్టించింది. మరోసారి రోహిత్ జట్టు టోర్నమెంట్ అంతటా మంచి ప్రదర్శన ఇచ్చి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలుచుకుంది.

Next Story