మూడో వన్డేలో భారత్ ఘనవిజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్
India won by 96 runs. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో
By Medi Samrat Published on 11 Feb 2022 3:38 PM GMT
శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. విండీస్ ముందు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 266 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య విండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలింగ్ విభాగంలో ప్రముఖ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు తీశారు. కాగా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు.
తొలుత భారత్ 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఆతిథ్య విండీస్ జట్టు భారత టాప్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. అయితే శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌ల ఆధిపత్య భాగస్వామ్యం గేమ్ పరిస్థితిని మార్చింది. శ్రేయాస్ అయ్యర్ 111 బంతుల్లో 80 పరుగులు, పంత్ 54 బంతుల్లో 56 పరుగులు చేశాడు. జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అల్జారీ జోసెఫ్, వాల్ష్ చెరో రెండు వికెట్లను సాధించారు. సిరీస్ విజయంతో కెప్టెన్‌గా రోహిత్ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడని నెట్టింట అతని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.