న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం

India won by 65 runs. బే ఓవ‌ల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఆదివారం జ‌రిగిన రెండో టీ 20లో భార‌త జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది.

By M.S.R  Published on  20 Nov 2022 11:18 AM GMT
న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం

బే ఓవ‌ల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఆదివారం జ‌రిగిన రెండో టీ 20లో భార‌త జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 65 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 192 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవ‌ర్ల‌లో 120 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ హాఫ్ సెంచ‌రీ (61 ప‌రుగులు)సాధించాడు. అయితే జట్టును విజయతీరాలకు చేర్చే ఇన్నింగ్స్ మాత్రం ఎవరూ ఆడలేదు. ఆల్ రౌండ‌ర్ దీప‌క్ హుడా నాలుగు వికెట్లు తీశాడు. మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్, య‌జువేంద్ర చాహ‌ల్ రెండేసి వికెట్లు తీశారు. భువ‌నేశ్వ‌ర్, వాషింగ్ట‌న్ సుందర్‌కు త‌లా ఒక వికెట్ ద‌క్కింది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. సూర్య కుమార్ యాద‌వ్ సెంచ‌రీ సాధించాడు. సూర్య సెంచ‌రీ బాదడంతో భారత జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ 111 స్కోర్‌తో నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచ‌రీకి 32 బంతులు తీసుకున్న సూర్య ఆ త‌ర్వాత మరింత దూకుడుగా ఆడాడు. మరో 17 బంతులో 50 ప‌రుగులు చేసి, సెంచ‌రీ మార్క్ అందుకున్నాడు. సూర్య మొత్తంగా 51 బంతుల్లోనే 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్ తో 36) కూడా రాణించాడు. మరో ఓపెనర్ రిషబ్ పంత్ 13 బంతులు ఆడి ఆరు పరుగులకే ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (13) హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఈ విజ‌యంతో భార‌త జ‌ట్టు మూడు టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.


Next Story
Share it