ఆస్ట్రేలియాను ఓడించి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

విరాట్‌ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌కు చేరింది.

By Medi Samrat  Published on  4 March 2025 9:47 PM IST
ఆస్ట్రేలియాను ఓడించి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

విరాట్‌ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌కు చేరింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఎదురైన ఓటమికి భారత్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భార‌త్‌ పైన‌ల్‌కు చేరడం ఇది వరుసగా మూడోసారి.

తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ 84 పరుగుల ఇన్నింగ్సుతో భారత్ 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది. కోహ్లి తన ఇన్నింగ్స్‌లో 98 బంతుల్లో ఐదు ఫోర్లు బాదాడు.

అత‌కుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, అలెక్స్ కారీ 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోరు అందించారు. కానీ రెండు ఇన్నింగ్స్‌లు వృథా అయ్యాయి. భారత్ తరఫున మహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు

Next Story