స్మృతి మంధాన, ప్రతీకా రావల్‌ల సెంచరీలతో భారత మహిళల జట్టు వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 435 పరుగులు చేసింది, ఇది ఈ ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు. అంతకుముందు, ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు ఐదు వికెట్లకు 370 పరుగులు చేసింది. కాగా తర్వాతి మ్యాచ్‌లోనే టీమిండియా ఆ రికార్డును బ్రేక్ చేసింది. వన్డేల్లో భారత మహిళల జట్టు 400 పరుగుల స్కోరును దాటడం ఇదే తొలిసారి.
మహిళల వన్డే క్రికెట్‌లో ఓ జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇది ఆరోసారి. అంతే కాదు పురుషుల జట్టు రికార్డును కూడా భారత మహిళల జట్టు బ్రేక్ చేసింది. 2011లో వెస్టిండీస్‌పై భారత పురుషుల జట్టు ఐదు వికెట్లకు 418 పరుగుల చేసింది. వన్డేలో ఇదే అత్యధిక స్కోరు. అయితే మహిళల జట్టు దీన్ని బ్రేక్ చేసి ఐర్లాండ్ ముందు 436 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో మహిళల జట్టు బ్యాటింగ్‌లో దుమ్ములేపింది. స్మృతి మంధాన(135), ప్రతీకా రావల్(154), రిచా ఘోష్(59) వీర బాదుడు బాదడంతో స్కోరు పరుగులు పెట్టింది.