ప్రస్తుతం భారత పురుషుల జట్టుతో పాటు మహిళల, అండర్-19 జట్లు కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి. టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. భారత మహిళలు 3-2తో ఇంగ్లండ్‌ను ఓడించారు. ఇంగ్లండ్‌లో భారత మహిళలు తొలిసారిగా సిరీస్‌ను కైవసం చేసుకున్నారు.
ఇప్పుడు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ జూలై 16 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయో.. ఈ ODI సిరీస్‌ను భారత్‌లో టీవీ మొబైల్‌లలో ఎలా చూడాలి అని తెలుసుకుందాం.
భారత మహిళల క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మధ్య వన్డే సిరీస్ సౌతాంప్టన్, లండన్, చెస్టర్-లీ-స్ట్రీట్‌లలో జరగనుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మధ్య వన్డే సిరీస్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు టాస్ జరుగుతుంది.
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మధ్య జరిగే వన్డే సిరీస్‌ను భారత్‌లో చూడవచ్చు. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సోనీ లైవ్ యాప్, ఫ్యాన్ కోడ్‌లో అందుబాటులో ఉంటుంది.
వన్డే సిరీస్ షెడ్యూల్
1వ ODI: జూలై 16 - ది రోజ్ బౌల్, సౌతాంప్టన్
2వ వన్డే: జూలై 19- లార్డ్స్, లండన్
3వ ODI: జూలై 22 - రివర్‌సైడ్ గ్రౌండ్, చెస్టర్-లీ-స్ట్రీట్