టీమిండియా విజయలక్ష్యం 413.. చేధించి సిరీస్ గెలిచేనా.?
ఆస్ట్రేలియా-భారత్ మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది.
By - Medi Samrat |
ఆస్ట్రేలియా-భారత్ మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో కొనసాగుతోంది. మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రత్యేక ప్రకటన చేసింది. మూడో వన్డే మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేసింది, ఇందులో భారత మహిళల జట్టు సాంప్రదాయ బ్లూ జెర్సీకి బదులుగా పింక్ జెర్సీని ధరించి మైదానంలో మ్యాచ్ ఆడింది. భారత మహిళల జట్టు పింక్ జెర్సీ ధరించి ఆస్ట్రేలియాతో మైదానంలో ఆడటానికి కారణం రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం.
ఇదిలావుంటే ఆస్ట్రేలియా జట్టు 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో హీలీ(30), జార్జియా(81), పెర్రి(68), బెత్ మూనీ(138), గార్డ్‌నర్(39) బ్యాట్‌తో రాణించారు. భారత్ తరఫున అరుంధతి రెడ్డి అత్యధికంగా మూడు వికెట్లు తీసింది. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, స్నేహ రాణా చెరో వికెట్ తీశారు. టీమిండియా ఇన్నింగ్సు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఖాతాలో వేసుకోవాలనుకున్న టీమిండియా ఎదుట భారీ లక్ష్యం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.