భారత్ మహిళల జట్టు ఆల్‌టైమ్ రికార్డు.. పురుషులకూ సాధ్యం కాలేదు!
చెన్నై వేదికంగా భారత్ ఉమెన్స్, దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 8:42 AM IST
భారత్ మహిళల జట్టు ఆల్‌టైమ్ రికార్డు.. పురుషులకూ సాధ్యం కాలేదు!
చెన్నై వేదికంగా భారత్ ఉమెన్స్, దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచల్ భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో లేని రికార్డును క్రియేట్ చేశారు. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తొలిరోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. టిస్టు క్రికెట్ చరిత్రలో (మెన్, ఉమెన్) ఒక జట్టు ఒకే రోజు ఆటలో ఇంత భారీ స్కోరు నమోదు చేయలేదు. మహిళా జట్టును అందరూ ప్రశంసిస్తున్నారు.
కాగా.. గతంలో 2022లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక పురుషుల జట్టు ఒకే రోజు 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేయగలిగింది. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసింది ఇండియా ఉమెన్ జట్టు. ఇక మహిళల క్రికెట్ విషయానికి వస్తే 1935లో క్రైస్ట్‌చర్స్ వేదికగా న్యూజిలాండ్ ఉమెన్స్‌పై ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టు ఒకేరోజు 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ఒకే దెబ్బకి అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఈమ్యాచ్‌లో భారత ఉమెన్ బ్యాటర్స్ రెచ్చిపోయి ఆడారు. ఓపెనర్ షఫాలీ వర్మ ఏకంగా డబుల్ సెంచరీ చేసింది 197 బంతుల్లో 205 పరుగులు చేసింది. ఆ తర్వాత రనౌట్ అయ్యింది. మరో ఓపెనర్ స్మృతి మందాన కూడా భారీ శతకాన్ని నమోదు చేసింది. 161 బంతుల్లో 149 పరుగుల చేసింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 292 పరుగుల భాగస్వామ్యాన్ని ఇచ్చారు. ఇక సుభా సతీశ 15, జమియా రోడ్రిగేజ్ 55, హర్మాన్‌ప్రీత్ కౌర్ 42(నాటౌట్), రీచా ఘోష్ 43 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికాకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు ఇండియా ఉమెన్స్ జట్టు. సౌతాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ రెండు వికెట్లు తీసుకుంది. అయితే.. డెల్మీ టెక్కర్ ఒక్కరే 141 పరుగులు సమర్పించుకుంది. రెండు వికెట్లలో షఫాలీ వర్మ వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.