ఉత్కంఠ పోరు.. పాక్‌పై భారత్ జయభేరి.. హార్దిక్ హిట్ షో
India win over Pakistan in thrilling cricket match. ఆసియాకప్‌లో మొదటి మ్యాచ్ గెలిచి టీమిండియా శుభారంభం చేసింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇదే
By అంజి Published on 29 Aug 2022 7:05 AM ISTఆసియాకప్‌లో మొదటి మ్యాచ్ గెలిచి టీమిండియా శుభారంభం చేసింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇదే మైదానంలో పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాభవానికి టీమ్‌ఇండియా బదులు తీర్చుకుంది. ఆదివారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో దాయాది పాకిస్తాన్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదటగా పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (43) రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హార్దిక్ పాండ్య (3/25), భువనేశ్వర్ (4/26) విజృంభించడంతో మొదట పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌటైంది.
అర్శ్‌దీప్ రెండు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. జడేజా (35), హార్దిక్ పాండ్య (33)ల అద్భుత పార్ట్‌నర్‌షిప్‌తో లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. కోహ్లి (35) రాణించాడు. కేఎల్ రాహుల్ ఎలాంటి రన్స్ చేయకుండానే వెనుదిరగగా.. చాలా రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (35 )రన్స్ చేసి ఫర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ (12) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (35), హార్దిక్ పాండ్యా (33) రాణించారు. హార్దిక్, జడేజా క్రీజులో ఉన్నా.. భారత్ చివరి మూడు ఓవర్లలో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్‌లో ఉత్కంఠ రేగింది.
కండరాలు పట్టేసినప్పటికీ పట్టుదలగా బౌలింగ్ చేసిన నసీమ్ షా బౌలింగ్‌లో జడేజా ఓ ఫోర్, సిక్స్ కొట్టాడు. విజయ సమీకరణం క్లిష్టంగా మారిన తరుణంలో హార్దిక్ పిడుగుల్లాంటి షాట్లతో జట్టును గెలిపించాడు. జడేజా చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అతడికి తోడు హార్దిక్ కూడా నిలిచాడు. హరీస్ వేసిన 19వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన పాండ్యా.. చివరి ఓవర్ నాలుగో బంతికి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 148 పరుగులతో ఘన విజయం సాధించింది. పాండ్యాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. భారత్ తమ తదుపరి పోరులో బుధవారం హాంకాంగ్‌తో తలపడనుంది.