ఫైన‌ల్ మ్యాచ్‌లో రాణించిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా విజ‌య‌ల‌క్ష్యం 177 ప‌రుగులు

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ మ్యాచ్ ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లూ ఓట‌మి లేకుండా ఫైన‌ల్ వ‌ర‌కూ అజేయంగా నిలిచాయి

By Medi Samrat  Published on  29 Jun 2024 9:50 PM IST
ఫైన‌ల్ మ్యాచ్‌లో రాణించిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా విజ‌య‌ల‌క్ష్యం 177 ప‌రుగులు

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ మ్యాచ్ ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లూ ఓట‌మి లేకుండా ఫైన‌ల్ వ‌ర‌కూ అజేయంగా నిలిచాయి. ఇక‌ పైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆదిలోనే రోహిత్‌(9), పంత్‌(0), సూర్య‌(3) త‌క్కువ ప‌రుగుల‌కే అవుట‌వ‌గా.. విరాట్ కోహ్లీ(76) మాత్రం.. అక్ష‌ర్‌(47), శివ‌మ్ దూబే(27)ల‌ సాయంతో భార‌త్ స్కోరును 20 ఓవ‌ర్ల‌కు 176 ప‌రుగులు చేర్చాడు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో కేశ‌వ్ మ‌హ‌రాజ్, నోకియా రెండేసి, ర‌బాడ‌, జాన్సెన్ ఒక్కోటి చొప్పున వికెట్లు ప‌డ‌గొట్టారు. ఈ మ్యాచ్‌లో 177 ప‌రుగులు చేస్తే ద‌క్షిణాఫ్రికా తొలి వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ గెలుస్తుంది. భార‌త్ గెలిస్తే రెండో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ వ‌శ‌మ‌వుతుంది. భార‌త్ గ‌తంలో 2007లో టైటిల్ గెలిచింది.

Next Story