రేప‌టి నుంచే IND vs SA టీ20 మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు ఇవే..!

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవుతూ ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని T20I జట్టు దక్షిణాఫ్రికాతో నవంబర్ 8న డర్బన్‌లో ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో తలపడనుంది

By Medi Samrat  Published on  7 Nov 2024 9:15 PM IST
రేప‌టి నుంచే IND vs SA టీ20 మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు ఇవే..!

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవుతూ ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని T20I జట్టు దక్షిణాఫ్రికాతో నవంబర్ 8న డర్బన్‌లో ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో తలపడనుంది. కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయ్యాక భారత క్రికెట్ అభిమానులు కాసింత నిరాశలో ఉండగా.. టీ20లో జోరు చూపించాలని యువ భారత్ ఉవ్విళ్ళూరుతోంది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో ఓటమి తర్వాత దక్షిణాఫ్రికాతో భారత్ పొట్టి ఫార్మాట్ లో తలపడుతూ ఉండడం ఇదే తొలిసారి.

ఐడెన్ మార్క్రామ్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు, భారత్‌కు గట్టి సవాలు విసరనుంది. విదేశాల్లో భారత టీ 20 జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందా అని కూడా అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

నవంబర్ 8న డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ క్రికెట్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం భారతదేశంలోని Sports18 1, Sports18 1 HD TV ఛానెల్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ మ్యాచ్ JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్

Next Story