విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు రాణించారు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) సెంచరీతో చెలరేగాడు, కెప్టెన్ బవుమా 48 రన్స్ రాణించారు.
మొదట్లో భారీగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ మధ్య ఓవర్లలో మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్‌క్రమ్‌తో పాటు క్వింటన్ డికాక్‌ను ఔట్ చేసి సఫారీల పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి క్యాచ్‌లు అందుకున్నారు. సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.