176 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మర్క్రమ్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 10:34 AM GMT176 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
సౌతాఫ్రికాతో టీమిండియా ప్రస్తుతం రెండో టెస్టు మ్యాచ్ ఆడుతోన్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మర్క్రమ్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు. బుమ్రా చెలరేగి బౌలింగ్ చేయడంతో అతని ఖాతాలో ఆరు వికెట్లు పడ్డాయి. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో మొత్తం బుమ్రా రెండో టెస్టు మ్యాచ్‌లో 8 వికెట్లు తీసుకున్నారు. ఇక ఈ ఇన్నింగ్స్‌లో ముకేశ్ 2, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 79 పరుగులు చేస్తే మ్యాచ్ గెలుస్తుంది.
రెండో ఇన్నింగ్స్‌ను రెండో రోజు సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద మొదలుపెట్టింది. అప్పటికే 3 వికెట్లో కోల్పోయింది. 103 బంతుల్లో 106 పరుగులు చేశారు సౌతాఫ్రికా బ్యాటర్ మర్క్రమ్. ఇందులో 17 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా (6/61) విజృంభణతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా మార్‌క్రమ్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ డ్రా చేయాలంటే భారత్.. 79 పరుగులు చేయాల్సి ఉంది. పేసర్లకు అనువుగా ఉన్న ఈ పిచ్‌లో భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి. తక్కువ టార్గెట్ కావడంతో ఎలాగైనా మ్యాచ్ గెలుస్తుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. కాగా.. ఈ మ్యాచ్ గెలిస్తే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ సమం కానుంది.