టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని మంచి జోష్‌లో ఉన్న భారత్ అదే ఊపులో వన్డే సిరీస్‌ను నెగ్గాలనే పట్టుదలతో ఉంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా లక్నోలోని అటల్ బిహరీ వాజ్‌పేయి స్టేడియంలో జరగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సఫారీలు తొలుత బ్యాటింగ్ చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకే మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం పలుమార్లు అడ్డంకిగా నిలిచింది.
ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో ఒక్కో బౌలర్ గరిష్టంగా ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాల్సి ఉంది. పవర్ ప్లే 10 ఓవర్లకు బదులు 8 ఓవర్లకు తగ్గించారు. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఆటగాళ్లు కాకుండా మిగిలిన ఆటగాళ్లు ఈ సిరీస్ ఆడనున్నారు. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత్ ఈ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ద్వారా రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లోకి అరగ్రేటం చేశాడు. మరోవైపు సఫారీలను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. డికాక్, బవుమా, మార్‌క్రమ్, డేవిడ్ విల్లర్‌లతో కూడిన ఆ జట్టు బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది.