హమ్మయ్య రిజర్వ్ డే.. ఉందట..!
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 8 Sep 2023 1:22 PM GMTభారత్-పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ మ్యాచ్ లు వర్షార్పణం అవుతూ ఉండడంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో టీమిండియా - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత ఇరు జట్లు కూడా సూపర్-4కు చేరుకున్నాయి. ఈ రెండు జట్ల మధ్య సూపర్-4 మ్యాచ్ ఈ నెల 10న జరగనుంది. ఈ మ్యాచ్ విషయంలో కూడా ఆందోళన ఉంది. అయితే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ దీనికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డేను ప్రకటించింది. 10వ తేదీన మ్యాచ్ ఆగిపోతే 11న ఆటను కొనసాగిస్తారు. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్స్ మ్యాచ్ కు కూడా రిజర్వ్ డేను ప్రకటించారు. ఇక ఇప్పటికే సూపర్ 4 లో పాకిస్థాన్ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది.
ఆసియా కప్ సూపర్ 4 షెడ్యూల్
సెప్టెంబర్ 9: శ్రీలంక vs బంగ్లాదేశ్, కొలంబో
సెప్టెంబర్ 10: ఇండియా vs పాకిస్థాన్, కొలంబో
సెప్టెంబర్ 12: ఇండియా vs శ్రీలంక, కొలంబో
సెప్టెంబర్ 14: పాకిస్థాన్ vs శ్రీలంక, కొలంబో
సెప్టెంబర్ 15: ఇండియా vs బంగ్లాదేశ్, కొలంబో
సెప్టెంబర్ 17: ఫైనల్, కొలంబో