టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-2లో భాగంగా ఆదివారం టీమిండియా, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పాక్ ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ(0) షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. మొదటి ఓవర్‌లో రోహిత్‌ను వెనక్కి పంపిన అఫ్రిది తన రెండో ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్(3)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆపై క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ విరాట్ కోహ్లి (57), రిషబ్ పంత్(30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు, హసన్ ఆలీ రెండు వికెట్లు, షాదాబ్ ఖాన్, హరీస్ రవూప్ తలో వికెట్ పడగొట్టారు.