ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారా.. అయితే

ఆసియా కప్ మొదలైంది. సెప్టెంబర్ 2న భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో

By Medi Samrat  Published on  31 Aug 2023 11:07 AM GMT
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారా.. అయితే

ఆసియా కప్ మొదలైంది. సెప్టెంబర్ 2న భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం కాండీలో వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని తెలియడంతో అభిమానులలో ఆందోళన మొదలైంది. సెప్టెంబర్ 2న జరిగే భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌కి మాత్రమే కాదని.. దాదాపుగా క్యాండీలో జరిగే అన్ని మ్యాచ్‌లకి వర్షం ముప్పు ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌ లో కూడా వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు ఉంది.

ఇక ఆసియా కప్‌ 2023లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో నేపాల్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇక పాక్ స్టార్‌ పేసర్‌​ షాహీన్‌ షా అఫ్రిది గాయం కారణంగా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్‌ అఫ్రిది పాత గాయం మళ్లీ తిరగబెట్టింది. మైదానంలో మోకాలి నొప్పితో అతడు బాధపడ్డాడు. అదే సమయంలో ఎండ తీవ్రత కూడా ఎక్కవగా ఉండడంతో అఫ్రిది ఇబ్బందిపడ్డాడు. ఫిజియో సలహా మేరకు అతడు మైదానాన్ని వీడాడు. నేపాల్‌ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అఫ్రిది.. 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

Next Story